శేఖర్ వర్మ, వైభవి జంటగా నటిస్తున్న సినిమా ‘కళ్యాణమస్తు’. ఎస్ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై బోయపాటి రఘుబాబు నిర్మిస్తున్నారు. ఓ సాయి దర్శకుడు. ఈ చిత్రం నుంచి ముక్కు పుడక లిరికల్ పాటను చిత్రబృందం విడుదల చేశారు. ‘గలగల నీ మాటల్లో ఉందే పిల్లా జాతర, సురసుర నీ చూపుల్లో ఉందే మందుపాతర’..అంటూ నాయిక అందాన్ని పొగుడుతూ సరదాగా సాగుతుందీ పాట.అలరాజు సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు ఆర్ఆర్ ధృవన్ సంగీతాన్ని అందించారు. మంగ్లీ, రఘురామ్ పాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మల్లికార్జున్ నరగాని.