శర్వానంద్ కెరీర్‌కు శ్రీకారం ఒక మంచి వ్యవ’సాయం’

చూస్తుంటే 2021 మన హీరోలకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది చాలా సంవత్సరాలుగా ప్లాపుల్లో ఉన్న రవితేజ, అల్లరి నరేష్ విజయం అందుకున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. అతడే శర్వానంద్. ‘శతమానం భవతి’ తర్వాత శర్వానంద్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఎంచుకున్న కథలు అతడి మార్కెట్‌ను దెబ్బతీశాయి. భారీ అంచనాలతో వచ్చిన ‘పడిపడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి.
ఇలాంటి సమయంలో విడుదలైన శ్రీకారం సినిమా చాలా రోజులుగా ఆయన కోరుకున్న విజయం అందించేలా కనిపిస్తోంది. ఏడాది కాలంగా విడుదల కాని శ్రీకారం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన ఈ సినిమాకు తొలి రోజే మంచి టాక్ వచ్చింది. వ్యవసాయం విలువను తెలుపుతూ.. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు కిషోర్. అనుకున్న కథను ఎక్కడ తప్పుదోవ పట్టకుండా ఉన్నది ఉన్నట్లు స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు.
దాంతో సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక మంచి కథను అంతే అందంగా తెరపై చూపించారు అంటూ కొత్త దర్శకుడి పనితీరును మెచ్చుకుంటున్నారు విశ్లేషకులు. అలాగే ఆడియన్స్ కూడా శ్రీకారం సినిమాకు మంచి మార్కులు వేస్తున్నారు. కానీ కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో ఉండటంతో ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమా చాలా వెనకబడింది. ప్రమోషన్ గాని బాగా చేసుకుంటే ఖచ్చితంగా శర్వానంద్‌కు ఇది ఒక మంచి విజయం అనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

