లండన్: ఇండియా, లీసెష్టర్‌షైర్ మధ్య జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. లీసెష్టర్‌షైర్ తరపున ఆడుతున్న చతేశ్వర్ పూజారాను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. డకౌట్ అయి వెనుదిరుగుతున్న పూజారాను బౌలర్ షమీ వెనుక నుంచి వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆట రెండవ రోజు చోటుచేసుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 246 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. లీసెష్టర్‌షైర్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 88 రన్స్ చేసింది. కడపటి వార్తలు అందేసరికి రిషబ్ పంత్ 16 రన్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
☝️ | 𝐏𝐮𝐣𝐚𝐫𝐚 𝐛 𝐒𝐡𝐚𝐦𝐢.
A second wicket for Shami. He dismisses his @BCCI teammate, as Pujara drags on.
Evison joins Kimber (28*).
🦊 LEI 34/2
𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/APL4n65NFa 👈
🦊 #IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/ANf2NfhUAy
— Leicestershire Foxes 🏏 (@leicsccc) June 24, 2022