DC vs GG : ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) ఓపెనర్ షఫాలీ వర్మ (shefali verma) హాఫ్ సెంచరీ కొట్టింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది రెండో ఫిఫ్టీ. 19 బంతుల్లోనే ఆమె అర్ధ శతకం బాదడం విశేషం. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు మేగ్ లానింగ్ (12), షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చారు. ఐదు ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌పై విఫలం అయిన షఫాలీ పవర్ హిట్టింగ్తో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడింది. ఫోర్లు, సిక్స్‌లతో డీవై పాటిల్ స్టేడియాన్ని హోరెత్తించింది.
గార్డ్నర్ వేసిన నాలుగో ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ దంచింది. దాంతో ఆ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. గార్త్ బౌలింగ్‌లోనూ షఫాలీ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టింది. తనూజా వేసిన రెండో ఓవర్లో సిక్స్, షఫాలీ ఫోర్ బాదింది.