పాత వాహనాలను తుక్కుకిస్తే..కొత్తవాటిపై మరిన్ని రాయితీలు

- కేంద్ర ప్రభుత్వం యోచన
- ప్రతి జిల్లాలో 3-4 తుక్కు కేంద్రాలు
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 23: జాతీయ వాహన తుక్కు విధానం కింద పాత వాహనాలను తుక్కుకు ఇచ్చి, కొత్త వాహనాలను కొనేటప్పుడు మరిన్ని పన్ను రాయితీలు ఇవ్వాలని యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విషయంపై ఆర్థిక శాఖతో మాట్లాడుతానని చెప్పారు. దేశంలో పాత వాహనాలను తుక్కుగా మార్చే తొలి కేంద్రాన్ని గడ్కరీ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వ అనుమతితో మారుతీ సుజుకి-టొయోట్సు సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. స్క్రాపేజ్ విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ ఆదాయం పెరుగుతుందని, అందుచేత ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చో ఆలోచించాలని జీఎస్టీ మండలిని గడ్కరీ కోరారు. కేంద్రం, రాష్ర్టాలకు రూ.40 వేల కోట్ల చొప్పున జీఎస్టీ ఆదాయం వస్తుందని చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 3 నుంచి 4 పాత వాహనాల రీసైక్లింగ్, స్క్రాపేజ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళిక రచిస్తున్నదని తెలిపారు.
వచ్చే రెండేండ్లలో దేశంలో పాత వాహనాలను తుక్కుగా మార్చే 200 నుంచి 300 కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ఆటోమొబైల్ రంగం వార్షిక టర్నోవర్ రూ.7.5 లక్షల కోట్లు అని, దాన్ని ఐదేండ్లలో రూ.15 లక్షల కోట్లకు పెంచాలన్నది తన లక్ష్యమని తెలిపారు. రాష్ర్టాలు స్క్రాపేజ్ విధానంలో ప్రజలు కొనే కొత్త వాహనాలకు రోడ్డు పన్నులో 25 రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ విధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. ఢిల్లీలో ప్రారంభమైన స్క్రాపేజ్ కేంద్రానికి ఏడాదికి 24 వేల పాత వాహనాలను తుక్కుగా మార్చి, రీసైకిల్ చేసే సామర్థ్యం ఉంది. రూ.44 కోట్ల ఖర్చుతో నెలకొల్పిన ఈ కేంద్రంలో పాత వాహనాలను శాస్త్రీయ పద్ధతిలో తుక్కుగా మార్చడానికి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తామని యాజమాన్యం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

