రోడ్డుపై వాగ్వాదం.. బైకర్‌ను ఢీకొట్టిన స్కార్పియో డ్రైవర్.. వీడియో
న్యూఢిల్లీ: ఢిల్లీలో హిట్ అండ్ రన్‌కు చెందిన ఓ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ఓ రోడ్డుపై వెళ్తున్న బైకర్ల గ్యాంగ్‌తో.. స్కార్పియో వాహనంతో వెళ్తున్న డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఓ దశలో స్కార్పియో డ్రైవర్ తన వాహనంతో ఓ బైకర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ బైకర్ కిందపడిపోయాడు. ఆ తర్వాత స్కార్పియో డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని మరో బైకర్ తన హెడ్‌గేర్ కెమెరాతో చిత్రీకరించాడు. ఢిల్లీలోని అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ కింద ఆదివారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ బైకర్‌ను 20 ఏళ్ల శ్రేయాన్ష్‌గా గుర్తించారు. ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ ట్రిప్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నారు.
@PMOIndia @ArvindKejriwal @DCPNewDelhi
Please help us , the Scorpio Car driver almost killed a few of our riders and threatened to kill us by crushing us under the car.
This is not what we vote for or pay taxes for
no one was severely injured
Gears respect riders pic.twitter.com/rcZIZvP7q4— ANURAG R IYER (@anuragiyer) June 5, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

