పరిధి తగ్గింది.. పరిరక్షణ పెరిగింది!
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు పోలీసుల కేటాయింపు అరకొరగానే ఉండేది. అందులో అగ్రభాగం బందో బస్తుకే పరిమితమయ్యేది. స్టేషన్లలో సిబ్బంది కొరత వేధించేది. రాత్రిపూట గస్తీ కాసేందుకు కానిస్టేబుల్ కూడా ఉండకపోయేది. ఫలితంగా, హైదరాబాద్ సహా.. అన్ని జిల్లాల్లోనూ నేరాలు నిత్యకృత్యంగా ఉండేవి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు పోలీసుల కేటాయింపు అరకొరగానే ఉండేది. అందులో అగ్రభాగం బందో బస్తుకే పరిమితమయ్యేది. స్టేషన్లలో సిబ్బంది కొరత వేధించేది. రాత్రిపూట గస్తీ కాసేందుకు కానిస్టేబుల్ కూడా ఉండకపోయేది. ఫలితంగా, హైదరాబాద్ సహా.. అన్ని జిల్లాల్లోనూ నేరాలు నిత్యకృత్యంగా ఉండేవి. అయితే, స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు చేపట్టిన పునర్వ్యవస్థీకరణతో.. జిల్లాల పరిధి తగ్గింది. కొత్త కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుతో.. నిఘా పెరిగింది. పోలీసు గస్తీ పెంచడంతో.. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. పోలీస్ పరిపాలనా వ్యవస్థ స్వరూపాన్నే మార్చేసింది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, సబ్ డివిజన్లు, సరిళ్లు, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్తగా 119 పోలీస్ స్టేషన్లు, 33 సరిళ్లు, 24 పోలీస్ సబ్డివిజన్లు, 20 జిల్లా పోలీస్ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం నాటి ‘సోషియో ఎకానామిక్ అవుట్’లో పేరొంది. చిన్న జిల్లాలతో ఎస్పీ పర్యవేక్షించాల్సిన భౌగోళిక పరిధి గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాల పరిధిలో వందల కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్లు, మండలాలన్నీ ఒకే ఎస్పీ పరిధిలో ఉండేవి. ఫలితంగా, ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ కరువయ్యేది. ప్రస్తుతం చిన్న జిల్లాల్లో ఎస్పీ కార్యాలయం నుంచి మారుమూల పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడం, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, సిబ్బందితో నేరుగా సమీక్షలు చేయడం, స్థానిక సమస్యలపై వెంటనే స్పందించడం సులభమైంది.

Ramagundam Police Commision
కొత్త కమిషనరేట్లు!
పోలీసు పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు మాత్రమే ఉండగా.. రాచకొండ (నేటి మల్కాజిగిరి), వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్లు వచ్చాయి. వీటికి తోడుగా అన్ని కొత్త జిల్లాలకు ఎస్పీ స్థాయి అధికారులను నియమించారు. వీటిల్లో కొన్ని జిల్లాలు ఆయా సమీప కమిషనరేట్ల పరిధిలో ఉన్నా.. పరిపాలనా సౌలభ్యం కోసం వాటికి ఎస్పీలను కేటాయించడం కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనం.
తగ్గిన ‘స్పాన్ ఆఫ్ ఏరియా’
పోలీస్ వ్యవస్థలో ‘స్పాన్ ఆఫ్ కంట్రోల్’ అత్యంత కీలకమైన అంశం. ఒక ఎస్పీ పరిధిలో ఎంత విస్తీర్ణం, ఎంత జనాభా, ఎన్ని సబ్ డివిజన్లు, ఎన్ని సరిళ్లు, ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నదే ఆ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ పరిధి చాలావరకూ తగ్గింది. ఫలితంగా ఒక ఎస్పీకి.. పోలీస్ స్టేషన్లను తరచూ తనిఖీ చేసే అవకాశం దొరికింది. తన జిల్లా పరిధిలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య ఎదురైతే.. ఎస్పీనే నేరుగా సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరిగి.. నేరాల కట్టడికి అవకాశం ఏర్పడింది. అంతేకాదు, గ్రామాలు, పట్టణాల్లోని స్థానిక సమస్యలు, అనుమానాస్పద కదలికలు లాంటి అంశాలను ముందుగానే గుర్తించేలా బీట్ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. వేల సంఖ్యలో అందించిన పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ కాస్తున్నారు.

Police
సాంకేతికతలో అగ్రస్థానం..
33 జిల్లాల్లోనూ హైదరాబాద్ స్థాయి సాంకేతిక వ్యవస్థలనే తీసుకొచ్చారు కేసీఆర్. రాజధాని మొదలుకొని.. మారుమూల పల్లె కూడళ్ల వరకూ సీసీటీవీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి.. వాటిన్నిటినీ అనుసంధానించారు. సైబర్ క్రైమ్ యూనిట్లు తీసుకొచ్చారు. జిల్లాల స్థాయిలోనూ డిజిటల్ కేస్ మానిటరింగ్ వంటి సాధనాలను వినియోగించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా పరిధి తగ్గింది. పోలీస్ స్టేషన్లు-సరిళ్లు-సబ్ డివిజన్లతో పోలీసు నిఘా పెరిగింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, పోలీసుల అందుబాటు మెరుగుపడింది. మొత్తంగా.. ప్రస్తుతం 904 పోలీస్స్టేషన్లతో రాష్ట్ర నలుమూలలా ఓ రక్షణ వలయం ఏర్పడింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణతో వచ్చిన మార్పులు
కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్లు 119
కొత్తగా ఏర్పడిన పోలీస్ సరిళ్లు 33
కొత్తగా నెలకొల్పిన పోలీస్ సబ్ డివిజన్లు 24
కొత్తగా ఏర్పాటైన జిల్లా పోలీస్ కార్యాలయాలు 20
పోలీస్ కమిషనరేట్లు 2 నుంచి 9కి పెరిగాయి.
– రవికుమార్ తోటపల్లి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

