‘జన్యు సవరణ’తో ఒకే లింగ ఎలుకలు!
- కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

లండన్: సాంకేతిక రంగంలో మరో అద్భుతం అవిష్కృతం అయింది. ఆడ లేదా మగ.. ఇలా ఒకే సెక్స్(లింగ) జంతువులను సృష్టించేందుకుగానూ జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) టెక్నాలజీని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ‘సీఆర్ఐఎస్పీఆర్-కాస్9’ అనే ఈ సాంకేతికత ద్వారా ఆడ లేదా మగ పిల్లలను మాత్రమే కనగలిగే ఎలుకల సంతానాన్ని ఉత్పత్తి చేశారు. దీన్ని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, ది యూనివర్సిటీ ఆఫ్ కెంట్కి చెందిన నిపుణులు అభివృద్ధి చేశారు. జంతువుల్లో ఫలదీకరణం తర్వాత ఒక సెక్స్ పిండాన్ని నిష్క్రియం(ఇన్ యాక్టివేట్) చేయడంలో ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ సాంకేతికత జంతు సంక్షేమాన్ని మెరుగుపరిచే అవకాశం ఉందని, లింగ అసమానత్వంతో అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు సాయపడుతుందని భావిస్తున్నారు.
అవసరం లేని ఆడ లేదా మగ జంతువులను పలు రూపాల్లో వదిలించుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే జననానికి ముందే తెలుసుకొని నియంత్రించుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో కానీ, పరిశోధనల సమయంలో గానీ కొన్ని సందర్భాల్లో ఒకే లింగ(సేమ్ సెక్స్) జంతువులు అవసరం అవుతుంటాయి. ఉదాహరణకు ఒక రైతుకు పొలంలో సేద్యానికి ఎద్దులు, దున్నపోతులు వంటివి ఉపయోపడుతాయి. ఇదే సమయంలో ఇంటి వద్ద పాల అవసరాలకు ఆవులు, బర్రెలను కోరుకుంటాడు. తనకు అవసరపడని వాటిని మాంసం కేంద్రాలకు అమ్మేస్తుంటాడు. అదేవిధంగా పునరుత్పత్తి వ్యవస్థ, లింగ ఆధారిత వ్యాధులు, ప్రత్యేక హర్మోన్లకు సంబంధించి పరిశోధనల సమయంలో ఒకే లింగ జంతువులే అవసరం అవుతుంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

