Telugu Book of Records | 42 ఏండ్ల పాటు సర్పంచ్… తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఉస్మానియా యూనివర్సిటీ :ఒక గ్రామానికి ఐదేండ్లు సర్పంచ్‌గా పనిచేయడమే కష్టం. కానీ ఏకంగా 42 ఏండ్లు పనిచేస్తే…. నిజంగా అది అరుదైనదే కదా! ఒక గ్రామానికి 42 ఏండ్లు సర్పంచ్‌గా కొనసాగి అరుదైన రికార్డు నెలకొల్పిన కేంద్యాల వీరస్వామి (90)కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అంతేకాకుండా ఎనిమిది సార్లు సర్పంచ్‌గా వరుసగా ఎన్నికై ప్రజాసేవకు అంకితమైనందుకు ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని సైతం అందజేశారు. తార్నాకలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి చేతుల మీదుగా ఆయనకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి సర్పంచ్‌గా 8 సార్లు వరుసగా ఎన్నికై 42 ఏండ్లు సుదీర్ఘకాలం సర్పంచ్‌గా పనిచేశారని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో గ్రామాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. వారి పదవీ కాలంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందజేశారని ప్రశంసించారు. గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి తన సొంత భూమిని విరాళంగా అందజేయడంతో పాటు ఆర్యసమాజ్ శాఖను ఏర్పాటు చేశారని కీర్తించారు. రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడిగా విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

