కేజ్రీవాల్ కోమాలోకి వెళ్లే ప్రమాదం
తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- ఆయన ప్రాణానికి ముప్పు: సంజయ్ సింగ్
న్యూఢిల్లీ, జూలై 15: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగే ఉంటే.. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రాణానికి హాని తలపెట్టే కుట్ర మొదలైందని ఆరోపించారు. అరెస్టుకు ముందు 70 కిలోలున్న కేజ్రీవాల్, ఇప్పుడు 61.5 కిలోలకు తగ్గారని చెప్పారు. దీనికంటే ముందు, కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆప్ వ్యక్తం చేసిన ఆందోళనల్ని తీహార్ జైలు అధికారులు ఖండించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్య నిపుణులు నిరంతం పరిశీలిస్తున్నారని తీహార్ జైలు అధికార వర్గాలు వెల్లడించాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఇంటి నుంచి తెప్పించిన ఆహారం అందజేస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ సంజయ్ సింగ్, కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు అధికారులు చెబుతున్నదాన్ని కొట్టిపారేశారు. జైల్లో కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు కోల్పోయారని, జూన్ 2 నుంచి 14 మధ్య 2 కిలోల బరువు తగ్గారని సంజయ్ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు 5 సార్లు పడిపోయినా, జైలు అధికారులు ఆ విషయాన్ని దాచిపెడుతున్నారని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

