“మాఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో యాక్షన్, డ్రామా, కామెడీ.. ఇలా అన్ని ఎమోషన్సూ ఉంటాయి. డైరెక్టర్ నందినీరెడ్డి, మా రాజ్ నిడిమోరు ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ సినిమా బాగా రావడానికి వారే కారణం. జూన్ 19న వస్తున్నాం. అభిమానులంతా గర్వపడేలా సినిమా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి’ అని అగ్ర నటి సమంత అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత నిర్మించింది.
సోమవారం హైదరాబాద్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడారు. ‘సమంత దినదినాభివృద్ది చెందుతున్నారు. ఈమె ఒకప్పటి సమంత కాదు. ఇప్పుడు తను నెక్ట్స్ లెవల్. ఈ సినిమాలోని ప్రతి సీన్లో అదరగొట్టేశారు. నేనూ సమంత అభిమానినే. మానిటర్ ముందు కూర్చొని చూశా. బ్లాక్బస్టర్ పక్కా’ అని డైరెక్టర్ నందినీరెడ్డి నమ్మకంగా చెప్పారు. “మా ఇంటి బంగారం’ అనే పేరులోనే ఎఫెక్షన్, లవ్ ఉంది. అలాగే దాని వెనుక డార్క్సైడ్, పొసెసివ్ నెస్ కూడా ఉంటుంది’ అని రాజ్ నిడిమోరు అన్నారు. ఇంకా హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి కూడా మాట్లాడారు.