బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్!
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడా? వయో పరిమితి నిబంధనల కారణంగా బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ (70) ఆ పదవి నుంచి వైదొలగగా రాజీవ్ శుక్లా ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ముంబై: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడా? వయో పరిమితి నిబంధనల కారణంగా బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ (70) ఆ పదవి నుంచి వైదొలగగా రాజీవ్ శుక్లా ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈనెల 28న ముంబైలో జరగాల్సి ఉన్న బీసీసీఐ ఏజీఎంలో అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవులకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా మాస్టర్ బ్లాస్టర్‌ను ఎన్నుకోనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే టెండూల్కర్ టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఈ మేరకు సచిన్ టీమ్ స్పందిస్తూ.. ‘బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సచిన్ పోటీ చేస్తున్నాడని, ఆ పోస్టుకు నామినేట్ అయ్యాడని వస్తున్న పుకార్లు మా దృష్టికి వచ్చాయి. ప్రస్తుతానికి సచిన్ అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు’ అని తెలిపింది. ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

