మైండ్ గేమ్ @ రోజర్ ఫెదరర్
Roger Federer: రోజర్ ఫెదరర్. ఓ దశాబ్ధ కాలం పాటు టెన్నిస్‌లో ఓ సంచలనం. 2003లో వింబుల్డన్ గెలిచిన ఫెదరర్ తన ఆట తీరుతో టెన్నిస్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన తర్వాత అతని దూ
హైదరాబాద్: రోజర్ ఫెదరర్. ఓ దశాబ్ధ కాలం పాటు టెన్నిస్‌లో ఓ సంచలనం. 2003లో వింబుల్డన్ గెలిచిన ఫెదరర్ తన ఆట తీరుతో టెన్నిస్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన తర్వాత అతని దూకుడుకు అడ్డేలేదు. స్విస్ లెజెండ్ ఫెదరర్ తన మైండ్‌గేమ్‌తో టెన్నిస్ ఆటకు కొత్త కళను తీసుకువచ్చాడు. తన వెరైటీ షాట్లతో ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేసేవాడు. ఫెడెక్స్ కొట్టే ఫోర్‌హ్యాండ్ షాట్లు టెన్నిస్ చరిత్రలోనే ఓ సెన్షేషన్. బేస్‌లైన్, నెట్ షాట్లు ఆడడంలో ఫెదరర్ ఓ మాస్టర్. ప్రేక్షకుల్లో టెన్షన్ నింపి.. తనదైన స్టయిల్లో మ్యాచ్‌ను వశం చేసుకోవడం ఫెదరర్‌కు తెలిసిన ఓ అరుదైన కళ. కోర్టులో ఈజీగా మూవ్ అయ్యే ఫెదరర్ చాలా జెంటిల్ స్ట్రోక్స్‌తో మ్యాచ్‌లను అవలీలగా గెలిచేవాడు.
టీనేజర్‌గా ఫెదరర్ తన గేమ్ స్టయిల్‌తో అందర్నీ అట్రాక్ట్ చేసేవాడు. చాలా కూల్‌గా రిటర్న్ షాట్లు కొడుతూ.. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంలా మారేవాడు. అతని ట్యాలెంట్ అతని టెంపర్మెంట్. నిజానికి టీనేజ్ దశలో అతని దురుసు టెంపర్‌మెంట్‌తో భారీ శిక్ష ఎదుర్కొన్నాడు. ఇక తర్వాత తన గేమ్ ప్లాన్‌లో మార్పు చేశాడు. ప్రొఫెషనల్ రాకెట్ పట్టాక.. ఫెదరర్ ఓ థ్రిల్లర్‌లా మారాడు. కెరీర్ ఆరంభంలో పొరపాట్లకు అవకాశమే ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో ప్రేక్షకుల్ని కిక్కెక్కించాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచిన ఫెదరర్ తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టెన్నిస్ అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కానీ వింబుల్డన్‌ను 8 సార్లు గెలవడం అతని ప్రత్యేకత.
గ్రాస్ కోర్ట్, హార్డ్ కోర్ట్, క్లే కోర్ట్ ఏదైనా.. ఫెదరర్ తన గేమ్ ప్లాన్‌తో ప్రత్యర్థులకు ఎప్పుడూ ఓ మిస్టరీగా ఎదురుపడేవాడు. 2001లో లెజెండరీ ప్లేయర్ పీట్ సంప్రాస్‌ను ఓడించిన తర్వాత టెన్నిస్ లోకంలో ఫెదరర్ ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా అవతరించాడు. ఓ దశలో అమెరికన్ స్టార్ ప్లేయర్ ఆండీ రాడిక్ గట్టి పోటీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రఫేల్ నాదల్, జోకోవిచ్ తరం మొదలైంది. 2008లో వింబుల్డన్ ఫైనల్లో నాదల్ చేతిలో ఫెదరర్ ఓడిపోవడం ఓ విషాదం. 5 సెట్ల మ్యాచ్ హోరాహోరీగా సాగినా.. ఫెడెక్స్ ఆ గేమ్‌లో తలవంచక తప్పలేదు. ఆ తర్వాతే నాదల్ శకం మొదలైంది. కొన్ని ఏళ్ల పాటు నాదల్ పవర్ గేమ్.. ఫెదరర్ క్లాస్ గేమ్ మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఆ మ్యాచ్‌లన్నీ టెన్నిస్ ప్రియులకు ఓ మజా. 2009 జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఫెదరర్.. ఆ ఏడాది కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేశాడు.
20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్న రోజర్.. గత మూడు సీజన్ల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిట్నెస్ సహకరించకపోవడంతో.. సరైన ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు. మరో వైపు నాదల్, జోకోవిచ్‌లు తమ పవర్ గేమ్‌తో ఫెడెక్స్‌కు అడపాదడపా చెక్ పట్టేశారు. ఇటీవలే మరో లెజెండ్ ప్లేయర్ సెరీనా విలియమ్స్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇప్పుడు ఆల్ టైమ్ గ్రేమ్ ప్లేయర్ ఫెదరర్ కూడా టెన్నిస్‌ను వీడడం బాధాకరమే. కానీ ఫెదరర్ అందించిన జ్ఞాపకాలు మాత్రం ఆ ఆటకు ఎప్పుడూ వన్నె తెస్తూనే ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

