‘తొలి అనుభవం’ పురుషుల్లో ఆలస్యం
- మహిళల్లో సగటున 18.9 ఏండ్లకే మొదటి కలయిక
- పురుషుల్లో ఆరేండ్లు ఆలస్యంగా 24.8 ఏండ్లకు
- పెరుగుతున్న ‘అన్ప్లాన్డ్’ అబార్షన్లు, సమస్యలు
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): మన దేశంలో ‘తొలి అనుభవాన్ని’ మహిళలతో పోల్చితే పురుషులు దాదాపు ఆరేండ్లు ఆలస్యంగా పొందుతున్నారట. స్త్రీ, పురుషుల మధ్య వివాహ వయసులో ఉండే తేడాయే ఇందుకు కారణం. మహిళలు సగటున 18.9 ఏండ్లకు తొలి కలయిక అనుభవం పొందితే.. పురుషులకు దాదాపు 24.8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే శృంగారంలో పాల్గొనే అవకాశం దక్కుతున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)-5 వెల్లడించింది. మన వ్యవస్థలో ఆడపిల్లలకు 18 ఏండ్లు నిండగానే పెండ్లి చేస్తుండటం, మగపిల్లలు ‘సెటిల్’ అయ్యేదాకా ఎదురు చూడాల్సి రావడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తున్నది. దేశంలో మహిళలకు సగటున 18.8 ఏండ్లకు, పురుషులకు 24.8 ఏండ్లకు పెండ్లిళ్లు అవుతున్నట్టు నివేదిక తెలిపింది. మరోవైపు ‘పిల్లలను కనడానికి మేమింకా సిద్ధంగా లేము’ (అన్ప్లాన్డ్) అనే కారణంతో అబార్షన్లు చేయించుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు సర్వే తేల్చింది. సర్వేలో భాగంగా 25-49 ఏండ్ల మధ్య వయసున్నవారిని ప్రశ్నించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అప్పుడే పిల్లలు ఎందుకు?
సర్వేకు ముందు ఐదేండ్లలో నమోదైన గర్భిణుల సమాచారన్ని విశ్లేషించగా.. 89 శాతం మందికి పిల్లలు పుట్టినట్టు తేలింది. 1 శాతం మందికి ఇంకా సంతానం కలుగలేదని, 7 శాతం మిస్క్యారీ, 3 శాతం అబార్షన్లు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది.
48 % అబార్షన్లు అయినవారిని ప్రశ్నించగా 48 శాతం మంది అనుకోకుండా గర్భం దాల్చామని చెప్పారు.
10 % 10 శాతం మంది.. ఇటీవలే ప్రసవం అయ్యిందని, మరో బిడ్డను కనేందుకు మరింత సమయం కావాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
27 % 27 శాతం మంది తమకు ఆరోగ్యం సహకరించక అబార్షన్ చేయించుకున్నట్టు చెప్పారు.
మిగతావారు శిశువు ఎదుగుదలలో సమస్యల వల్ల తప్పని పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందన్నారు.
25 శాతం ఇంట్లోనే అబార్షన్
పిల్స్ వచ్చిన తర్వాత అబార్షన్ ప్రక్రియ చాలా సులభం అయిపోయింది. సర్వే సైతం ఇదే తేల్చింది. నమోదైన అబార్షన్లలో 53 శాతం ప్రైవేట్ హాస్పిటళ్లలో, 20 శాతం ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయి. మిగతా 27 శాతం మంది ఇంట్లోనే సొంతగా అబార్షన్ చేసుకున్నట్టు తేలింది.
16 %ఇంట్లోనే అబార్షన్ చేసుకున్నవారిలో సగం మందికిపైగా (16 శాతం) ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాదాపు అందరూ మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో మహిళలకు సుమారు రెండేండ్లు ఆలస్యంగా పెండ్లిళ్లు అవుతున్నాయని తేలింది. చదువు కొనసాగించడమే ఇందుకు కారణమని సర్వే పేర్కొన్నది
25-49 ఏండ్ల వయస్కుల్లో.. 10 శాతం మంది మహిళలు 15 ఏండ్లకన్నా తక్కువ వయసులో, 39 శాతం మంది 18 ఏండ్లలోపే మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నట్టు చెప్పారు.
ఇదే పురుషుల్లో 15 ఏండ్లలోపు కేవలం ఒక్క శాతం, 18 ఏండ్లలోపు 6 శాతంగా తేలింది. మహిళల్లో బాల్యవివాహాలు ఎక్కువగా కావడమే ఇందుకు కారణమని విశ్లేషించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

