Aleppo Prison Riot | ఉత్తర (North) సిరియాలోని అలెప్పో నగరంలో ఉన్న ఐన్ అంల్ అరబ్ జైలులో ఖైదీల మధ్య చెలరేగిన అల్లర్లతో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఏడుగురు ఖైదీలు మరణించగా, డజన్లకొద్దీ పొగపీల్చడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ జైలులో ఉన్న కొంతమంది ఖైదీలను అలెప్పో నగరంలోని మరో జైలుకు తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. విషయం తెలిసిన ఖైదీలు అల్లర్లకు దిగారు. అదే సమయంలో తమ గదులకు నిప్పు పెట్టారు. మంటలు వేగంగా ఇతర గదులకు వ్యాపించడంతో ఏడుగురు ఖైదీలు సజీవ దహనమవ్వగా, డజన్ల కొద్దీ పొగ వల్ల ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అంతర్జాతీయ వార్తాసంస్థలు వెల్లడించాయి.
ఐన్ అల్ అరబ్ ప్రాంతం కుర్దిష్, అరబ్స్ మధ్య ఉద్రిక్తతకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తుంది. వీరి మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ఈ ప్రాంతంలోని భద్రతా విషయాల్లో మార్పులు చేపడుతున్నారు. దీంతో సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (SDF) రద్దయిన తరువాత కూడా ఈ జైలు పాత సిబ్బంది, కుర్దిష్ ఫైటర్ల నిర్వహణలో కొనసాగుతుంది. సిరియా అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ దీన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదు. దీంతో ఈ అల్లర్లు జరిగాయి.