పన్ను ఆదాతోపాటు.. రాబడీ ముఖ్యమే
పన్ను ఆదా చేయడం కోసం చివరి రోజులు ఇవే. ఇప్పటికే ఏటా చేస్తున్న ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటివి కాకుండా ఇంకా చేయాల్సివస్తే ఎలాంటి సాధనాల్లో చేయాలనే సందిగ్ధత అందిరిలోనూ ఉంటుంది. దానికి తోడు ఎంత పన్ను చెల్లించాలో తెలిస్తే సాధ్యమైనంత ఎక్కువగా ఆదా చేయడానికి, అందుకు తగ్గట్టుగా పన్ను ప్రణాళికను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. https://www.incometaxindiaefiling.gov.in అనే వెబ్సైట్లో మన ఆదాయాలు, సేవింగ్స్, వ్యయాలను పొందుపరిస్తే పన్ను ఎంత చెల్లించాలో గణించి చెప్పేసే వీలును కల్పించారు.
పన్ను కోసం ఆదా చేస్తున్నాం కనుక రాబడి విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. అలాగే పన్ను ఆదా కోసం చేసే మదుపులో రిస్కును భరించే శక్తి, లాక్ఇన్ పీరియడ్ లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. సాధారణంగా టాక్స్ సేవింగ్ సాధనాల్లో కనీసం మూడేండ్ల లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో మనం మదుపు చేసిన ఆర్థిక సాధనం బెంచ్‌మార్క్ రాబడుల కన్నా అధికంగా రాబడి ఇస్తుందో లేదో చూసుకోవాలి. కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే ఉన్న డిడక్షన్లను కొగసాగిస్తూ పాత పన్ను పద్ధతులనే అనుసరించవచ్చు. లేదా డిడక్షన్స్ ఆప్షన్ లేకుండా కొత్త ఆదాయ పన్ను నిబంధనలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. వేర్వేరు పన్ను ఆదా సాధానాల్లో వచ్చే రాబడి, లాక్ఇన్ పీరియడ్ లాంటి వివరాలను చూద్దాం.
సెక్షన్80జీ కింద మినహాయింపు
ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ స్వచ్ఛ భారత్ ఖోష్ తదితర సంస్థలకు ఇచ్చే విరాళాలను గరిష్ఠంగా రూ.2000 వరకు మినహాయింపు పొందవచ్చు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్
ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీ కింద అత్యంత ఉత్తమ మార్గం ఇది. ఈక్విటీ మార్కెట్లలో మదుపు చేయడంపాటు మూడేండ్ల లాక్ఇన్ పీరియడ్ ఉండడం వల్ల రాబడులు అధికంగా ఉంటాయి. రూ.లక్ష లోపు రాబడిపై దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చార్జ్ చేయరు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
పీపీఎఫ్ దీర్ఘకాల సేవింగ్స్ స్కీం. ఇది 15 ఏండ్ల లాక్ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటుంది. ఐదేండ్ల చొప్పున స్కీం కాలపరిమితిని పెంచుకోవచ్చు. దీనిపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా పన్ను పరిధిలోకి రాదు.
జీవిత బీమా
తన తదనంతరం కుటుంబ భద్రత కోసం తీసుకొనే ధీమా ఇది. చెల్లించే ప్రీమియంలను కేవలం పన్ను ఆదా కోసమే అని పరిగణించకుండా కుటుంబ భద్రత కోసంగా పరిగణించాలి. చెల్లించే ప్రీమియంలకు 80సీ కింద పన్నుమినహాయింపు ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లు
ఐదేండ్ల కాలం పరిమితికి పైగా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 80సీ కింద పన్ను ఆదా చేయవచ్చు. అయితే కాలపరిమితికి ముందుగానే, విపత్కర పరిస్థితుల్లో విత్‌డ్రా చేసుకుంటే పన్ను ఆదా బెనిఫిట్స్ ఉండవు. అలాగే వీటిపై వచ్చే వడ్డీపై కూడా పన్ను ఆదా ఉండదు.
నేషనల్ పెన్షన్ స్కీమ్
రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్టర్లకు భద్రత కల్పించే స్కీం ఇది. ప్రిన్సిపల్ మొత్తం లక్షన్నర వరకు సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వ్యక్తులకు మరో 50 వేల వరకు సెక్షన్ 80సీసీడీ కింద మినహాయింపు.
హోమ్ లోన్ డిడక్షన్
హోమ్ లోన్ తీసుకున్నఇంటి యజమానులు సెక్షన్ 24 కింద వడ్డీ చెల్లింపుపై డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ హోమ్ లోన్ తీసుకుని కొన్న ఇంట్లోనే యజమానులు ఉంటే గరిష్ఠంగా రెండు లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.
విద్యా రుణాలు
సెక్షన్ 80ఈ కింద పిల్లల ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీని డిడక్షన్‌గా క్లెయిమ్ చేయవచ్చు. అయితే విద్యా రుణాలు చెల్లించే సమయం నుంచే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే అప్పటి నుంచి ఎనిమిదేండ్ల కాలానికి మాత్రమే ఈ మినహాయింపు పరిమితం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- revenue
- tax savings
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం


