వ్యాక్సిన్ సర్టిఫికేట్ల నుంచి మోదీ ఫోటో తీసేయండి..

న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా సర్టిఫికేట్లపై ఉన్న ప్రధాని మోదీ ఫోటోను తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోదీ ఫోటోలు ఉన్న ద్రువపత్రాలను ఇవ్వరాదు అని ఈసీ చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. అయితే మిగితా అన్ని రాష్ట్రాల్లో మోదీ ఫోటో ఉన్న సర్టిఫికేట్లను ఇవ్వవచ్చు అని ఈసీ వెల్లడించింది. మార్చి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న సర్టిఫికేట్లపై మోదీ ఫోటో ఉంటోందని, డాక్టర్లు,-నర్సులు-హెల్త్‌కేర్ వర్కర్ల నుంచి ప్రధాని క్రెడిట్ కొడుతున్నారని ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. డాక్టర్లు, నర్సుల నిస్వార్థ సేవలను దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ ఎంపీ డెరిక్ ఆరోపించారు. పెట్రోల్ బంకుల్లో మోదీ హోర్డింగ్‌లను తీసివేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Modi
- vaccine certificate
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

