ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం: కేవైసీ అందించేందుకు బ్రాంచీలకు రమ్మనొద్దు
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం కలిగించే వార్త. మే 31 లోపు కేవైసీలను అందించకపోతే ఖాతాలను స్తంభింపజేస్తామన్న చర్యను ఎస్బీఐ ఉపసంహరించుకున్నది

ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం కలిగించే వార్త. మే 31 లోపు కేవైసీలను అందించకపోతే ఖాతాలను స్తంభింపజేస్తామన్న చర్యను ఎస్బీఐ ఉపసంహరించుకున్నది. ఇదే సమయంలో కేవైసీ అందించేందుకు ఖాతాదారులను బ్రాంచీలకు రమ్మని వారిపై ఒత్తిడి తేవద్దంటూ అన్ని శాఖలకు ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలు పోస్ట్ లేదా రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడీ ద్వారా అవసరమైన పత్రాలను అందజేయవచ్చునని సూచించింది.
కొంతకాలం క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్ తర్వాత బ్యాంక్ ఈ చర్య తీసుకున్నది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విభాగాలను ఆదేశించారు.
అన్ని బ్యాంకులు సాధారణంగా తక్కువ రిస్క్ క్యాటగిరీలో ఉన్న వినియోగదారులను ప్రతి పదేండ్లకు ఒకసారి వారి కేవైసీని ఇవ్వమని అడుగుతాయి. మీడియం రిస్క్ క్యాటగిరీలోని వినియోగదారులు ప్రతి ఎనిమిదేండ్లకోసారి వారి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అధిక రిస్క్ క్యాటగిరీ వినియోగదారులు ప్రతి రెండేండ్లకు ఒకసారి కేవైసీని నవీకరించాల్సి ఉంటుంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి కేవైసీ ఇవ్వడం కుదరని పరిస్థితులు ఉండటంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. కేవైసీ ఇవ్వనివారి ఖాతాలను ఫ్రీజ్ చేయలేమని కూడా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఎలోన్ మస్క్తో నాసా ఒప్పందం
ఆఫ్ఘనిస్తాన్లో కారు బాంబు పేలుడు.. 30 మంది దుర్మరణం
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
మే డే వర్ధిల్లాలి.. చరిత్రలో ఈరోజు
అమెరికాతో పోరు ఎప్పటికీ ముగియదు : అల్ ఖైదా
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

