వాషింగ్టన్: భూమికి 2.8 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో శనిగ్రహం సైజులో ఉన్న ఓ గ్రహాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. సర్పిలాకారంలో ఉన్న గెలాక్సీలోని ఓ నక్షత్రం చుట్టూ ఇది తిరుగు తున్నది. పాలపుంత గెలాక్సీ బయట గుర్తించిన మొట్టమొదటి ఎక్సోప్లానెట్ ఇదే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. సౌరకుటుంబం అవతల పరిభ్రమించే గ్రహాలను ఎక్సోప్లానెట్లుగా పిలుస్తారు.