హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, కార్యదర్శిగా ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ జీ నరేంద్ర ఎన్నికయ్యారు. ఫోరం ఎన్నికలను ఆదివారం నాంపల్లిలోని టీజీవో భవన్లో నిర్వహించగా, ఎన్నికల అధికారిగా గండూరి వెంకటేశ్వర్లు, సహాయ ఎన్నికల అధికారి షౌకత్ హుస్సేన్ వ్యవహరించారు.
అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మహ్మద్, ఉపాధ్యక్షులుగా ఏ అరవింద్ బాబు, మధుబాబు, ఎండీ హమీద్, మాధవ్, కే జ్యోతిరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా డీ సందీప్‌కుమార్, ఎం పురియా, ఎండీ మక్సూద్ అలీ, అప్పారావు, కే ఆంజ నేయులు, కే సాయివికాస్, డీ జ్యోతి, కోశాధికారిగా వీ సీతారాం, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బీ శ్రీనివాస్, జీ రామ్‌కుమార్, పబ్లిసిటీ సెక్రటరీలుగా బీ సమ్మయ్య, బీ ఆనంద్‌తోపాటు, బీ సురేశ్, టీ నరేశ్, చంద్రశేఖర్, బీ బలరామ్‌ను ఎన్నుకున్నారు.