అభివృద్ధి పథంలో తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం
మండల పరిధిలోని తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర పరిధిలోని ఆయా గ్రామాల్లో 2,200 మంది సభ్యులు ఉండగా, అందులో 800 మంది సంఘం పరిధిలో రుణాలు కలిగి ఉన్న సభ్యులుగా ఉన్నారు.
- -రూ.10 కోట్ల ఎల్టీ, ఎస్టీ లోన్ల టర్నోవర్..
- 2,200 మంది సభ్యులతో ముందుకుసాగుతున్న సంఘం
- 800 మంది సభ్యులకు రుణాలు అందజేత
- రూ. కోటీ 20లక్షలు బంగారంపై రుణాలు
- రూ.35లక్షలు చిరువ్యాపారులకు రుణాలు
పెద్దేముల్, నవంబర్ 24 : మండల పరిధిలోని తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర పరిధిలోని ఆయా గ్రామాల్లో 2,200 మంది సభ్యులు ఉండగా, అందులో 800 మంది సంఘం పరిధిలో రుణాలు కలిగి ఉన్న సభ్యులుగా ఉన్నారు. సహకార సంఘం పరిధిలోని ఆయా గ్రామాల సభ్యులతో సంఘం ఎల్టీ, ఎస్టీ లోన్లతో రూ.10కోట్ల టర్నోవర్‌లో ఉంది. రూ.కోటీ 20 లక్షల బంగారు రుణాలు, రూ.35 లక్షల చిరువ్యాపారుల రుణాలతో ప్రస్తుతం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. దీనితోడు తట్టేపల్లి సహకార సంఘంలో గతంలో 100 టన్నుల సామర్థ్యం ఉన్న చిన్నగోదాం, ప్రత్యేకమైన స్ట్రాంగ్ రూమ్, దుకాణ సముదాయం, సహకార కార్యాలయం అందుబాటులో ఉండేది. సంఘ పరిధిలో 2,200 మంది రైతులు సభ్యులుగా ఉండడంతో చిన్నపాటి గోదాంలో రైతులకు సరిపడా ఎరువులు, మందులకు నిల్వ ఉంచడానికి సంఘానికి నానా ఇబ్బందులు ఎదురయ్యేవి. రైతులకు అన్ని రకాల ఎరువులు, మందులు సహకార సంఘం పరిధిలో పాలకమండలి చైర్మన్, సభ్యులు దశలవారీగా సీజన్ల వారీగా అందుబాటులో ఉంచి రైతులకు మేలు జరిగేలా చూసేవారు. ప్రస్తుతం నూతన గోదాం నిర్మాణంతో ఆ ఇబ్బందులు తొలిగిపోనున్నాయని అధికారులు, పాలకమండలి సభ్యులు తెలుపుతున్నారు.
నూతన గోదాం నిర్మాణం
మండల పరిధిలోని తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో నూతనంగా సుమారు రూ.65,48000లక్షలతో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న నూతన గోదాం, అదేవిధంగా రూ.18 లక్షలతో రైతు సేవా సహకార సంఘం నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. గోదాం, సహకార సంఘం భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సంఘ పరిధిలో ఉన్న 2,200 మంది సభ్యులకు ఎరువులు, మందులు, క్రిమిసంహారక మందులు, కందుల కొనుగోలుకు అనువుగా ఉండే విధంగా గోదాం నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం గోదాం నిర్మాణంలో భాగంగా గోడలు, కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తికాగా గోదాం షెడ్, ఫ్లోరింగ్ బెడ్ పనులు పూర్తికావాల్సి ఉంది. పెద్ద మొత్తంలో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాం నిర్మాణంతో సంఘ పరిధిలోని రైతులకు గతంలో ఎరువులు, మందుల పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అదే విధంగా అందులో అన్ని రకాల ఎరువులు, మందులు, క్రిమిసంహారక మందులతోపాటు కందుల కొనుగోలు జరుపుకొనే విధంగా వెసులుబాటు కలుగనుంది. నూతన గోదాం నిర్మాణంతో రైతులకు వ్యవసాయపరంగా అవసరమైనన్నీ ఎరువులు, మందులు అందుబాటులో ఉంచి రైతులకు సరియైన సమయానికి అందేలా తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకమండలి చైర్మన్, వైస్ చైర్మన్, పాలకమండలి సభ్యులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతూ త్వరలో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నగోదాంను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇబ్బందులను దూరం చేస్తున్నాం
తట్టేపల్లి సహకార సంఘం పరిధిలో ఉన్న సుమారు 2,200 మంది సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకొంటున్నాం. ముఖ్యంగా సభ్యులకు రుణాల పరంగా, ఎరువులు, మందుల పరంగా ఏ సమస్య తలెత్తకుండా చూసుకొని సీజన్ల వారీగా రైతులకు కావాల్సిన మందులు, ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. సంఘం సభ్యులు, రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకొంటున్నాం.
– చిట్లపల్లి అంజయ్య, వైస్ చైర్మన్,తట్టేపల్లి సహకార సంఘం
ప్రతి సభ్యుడికీ సహకారం అందిస్తాం..
తట్టేపల్లి సహకార సంఘ పరిధిలో సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యుడికీ పాలకమండలి చైర్మన్, సభ్యులు, సిబ్బంది సహకారాలతో అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నాం. రైతులకు ఎరువులు, మందులు, విత్తనాల పరంగా కొరత లేకుండా సీజన్ల వారీగా సమాచారం అందించి తోడ్పాటును అందిస్తున్నాం. సమష్టిగా పనిచేస్తూ సంఘం అభివృద్ధిలో భాగస్వాములం అవుతున్నాం.
– రాజమౌళి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,తట్టేపల్లి సహకార సంఘం
సంఘాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నాం
మండల పరిధిలోని తట్టేపల్లి సహకార సంఘాన్ని దశలవారీగా అభివృద్ధి పరుస్తూ వ్యవసాయ పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. రైతులకు ఎక్కువ మొత్తం ఎరువులు, మందులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా నూతనంగా 1000 మెట్రిక్ టన్నుల గోదాంను నిర్మిస్తున్నాం, త్వరగా గోదాంను అందుబాటులోకి తీసుకొచ్చి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొంటున్నాం.
– పి.లక్ష్మారెడ్డి,తట్టేపల్లి సహకార సంఘం చైర్మన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

