Rana Daggubati | సోనమ్ కపూర్, దుల్కర్ సల్మాన్‌లకు క్షమాపణలు చెప్పిన రానా.. ఎందుకంటే
Rana Daggubati | మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నటిస్తున్న తాజా చిత్రం కింగ్ అఫ్ కోత(King of Kotha). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ హీరో రానా మాట్లాడినా మాటలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా ఈ వివాదంపై రానా స్పందించారు.
Rana Daggubati | మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నటిస్తున్న తాజా చిత్రం కింగ్ అఫ్ కోత (King of Kotha). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా (Rana), నాని(Nani)లు ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఇక ఈవెంట్లో భాగంగా దుల్కర్ సల్మాన్ గురించి రానా గొప్పగా చెబుతూ.. ఓ బాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు చేశాడు. ఒక హిందీ షూటింగ్లో భాగంగా దుల్కర్ ఓపికగా వెయిట్ చేస్తుంటే.. ఆ హీరోయిన్ మాత్రం లండన్‌లో ఉన్న భర్తతో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. దాని వల్ల షూటింగ్ ఎఫెక్ట్ అయితున్న దుల్కర్ మాత్రం ఓపికగా తన పని తాను చేసుకున్నాడు. ఈ విషయంలో నేను నిర్మాతలని తిట్టానని రానా చెప్పుకోచ్చాడు.
దీంతో రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దుల్కర్‌ని ఇబ్బందిపెట్టిన ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరా అని నెటిజెన్లు సెర్చ్ చేశారు. అయితే దుల్కర్‌ని ఇబ్బంది పెట్టింది సోనమ్ కపూర్ (Sonam Kapoor) అని అందుకే రానా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కాస్తా వైరల్‌గా మారగా.. దీనిపై తాజాగా రానా ట్విట్టర్లో స్పందించాడు.
రానా మాట్లాడుతూ.. “నేను సరదాగా అన్న మాటల వల్ల సోనమ్ కపూర్ పైన కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూసి నేను ఆందోళన చెందుతున్నాను. స్నేహితులుగా మాకు మేము సరదాగా కామెంట్స్ చేసుకుంటాము. అటువంటి విషయం ఇలా తప్పుగా జనాల్లోకి వెళ్లడం పట్ల నేను చింతిస్తున్నాను. ఈ విషయంలో సోనమ్‌కి, దుల్కర్‌కి నేను క్షమాపణలు చెప్పాలి. సోనమ్‌కి, దుల్కర్ ఇద్దరి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ విషయం ఇక్కడితో ముగుస్తుందని.. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాని రానా ట్విట్టర్లో రాసుకోచ్చాడు.
I am genuinely troubled by the negativity that has been aimed at Sonam due to my comments, that are totally untrue and were meant entirely in a light-hearted manner. As friends, we often exchange playful banter, and I deeply regret that my words have been misinterpreted.
I take…— Rana Daggubati (@RanaDaggubati) August 15, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

