Statue of Equality | రెండో రోజు కొనసాగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు
Statue of Equality | నగర శివార్లలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువులో రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరుగుతుంది. ఈ హోమాన్ని ఐదు వేల మంది రుత్విక్కులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి..
రామానుజాచార్య సమారోహంలో భాగంగా 12 రోజులపాటు నిర్వహంచనున్న మహా యజ్ఞం కోసం మొత్తంగా 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. ఈ నెయ్యి మొత్తాన్ని రాజస్థాన్ రాష్ట్రం పాత్మెడాలోని పూర్తి స్వదేశీ ఆవులను తీసుకొచ్చి ముచ్చింతల్, తాండూరులలోని వ్యవసాయ క్షేత్రాల్లో పోషిస్తూ వాటి పాల నుంచి సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి మార్గనిర్దేశకత్వంలో దాదాపు 6 నెలల ముందునుంచే యజ్ఞం కోసం నెయ్యిని సిద్ధం చేయడం మొదలుపెట్టడం విశేషం. యజ్ఞ సమిధలను సైతం శాస్త్రబద్ధంగా తయారుచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

