బుల్లెట్ పాట వచ్చేసింది..
రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్నది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి హీరో శింబు పాడిన ‘బుల్లెట్..’ పాటను తాజాగా చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ…‘నేను చెన్నైలోనే చదువుకున్నాను. నా తొలి సినిమా తమిళంలో చేయాల్సింది. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. లింగుస్వామి ఈ కథ చెప్పి ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు అనగానే ఆశ్చర్యపోయాను. అతనితో కలిసి నటించడం మంచి అనుభవం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో పాటు చిత్రబృందం పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

