Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Jangaa | శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘జంగా’.
Jangaa | శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘జంగా’. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా విడుదల చేశారు. త్రిగుణ్ కెరీర్లో ఇది సరికొత్త మైలురాయిగా నిలవనుందని ఈ గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో త్రిగుణ్ సరసన నేహా పఠాన్ నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ, సమీర్, నాగ మహేష్, భూపాల్ రాజు, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కొన్ని లక్షల ఏండ్లు పట్టింది.. పశువు మనిషి అవ్వడానికి.. మళ్లీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను.. మనిషి పశువు అయితే.. మరణం వదం అయితాది’ అంటూ త్రిగుణ్ చెప్పిన శక్తివంతమైన డైలాగ్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. రా అండ్ రస్టిక్ లుక్‌లో త్రిగుణ్ కనిపిస్తుండగా, మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా పవర్ఫుల్ రోల్లో కనిపించి ఆకట్టుకుంటున్నారు.
మానవ భావోద్వేగాలు, పుట్టుక-చావుల మధ్య ఉండే సంక్లిష్టతలు, ఆధ్యాత్మిక కోణాలను స్పృశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు అందిస్తుండగా, కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటలు రాస్తున్నారు. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

