సిద్ధ ఎంట్రీకి టైం ఫిక్స్ అయినట్టేనా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్బంగా మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. మార్చి 27న చరణ్ తన 36వ బర్త్‌డేని జరుపుకోనుండగా, ఆయన పుట్టిన రోజు పురస్కరించుకొని ఆర్ఆర్ఆర్ నుండి సర్ప్రైజింగ్ పోస్టర్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోను రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషించగా, ఆ సినిమా నుండి చరణ్‌కు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు.
చరణ్ తాజాగా తన అభిమానులతో జరిపిన ఇంట్రాక్షన్ లో రేపు ఆచార్య నుండి సిద్ధ లుక్‌ను విడుదల చేయనున్నారని పేర్కొన్నాడు. సిద్ధగా రామ్ చరణ్ ఎలా ఉంటాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

