బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్
Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షెర్లిన్ చోప్రా నమోదు చేసిన కేసులో అంబోలీ పోలీసులు రాఖీ సావంత్‌ను అరెస్టు చేశారంటూ.. షెర్లిన్ చోప్రా ట్విట్టర్ ద్వారా తెలిపింది. రాఖీ, తన భర్త ఆదిల్
Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షెర్లిన్ చోప్రా నమోదు చేసిన కేసులో అంబోలీ పోలీసులు రాఖీ సావంత్‌ను అరెస్టు చేశారంటూ.. షెర్లిన్ చోప్రా ట్విట్టర్ ద్వారా తెలిపింది. రాఖీ, తన భర్త ఆదిల్ దుర్రానీతో డ్యాన్స్ అకాడమీని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. ఈలోగానే ఆమెను అంబోలీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. రాఖీ సావంత్ యాంటిసిపేటరీ బెయిల్ ముంబయి సెషన్స్ కోర్టు కొట్టివేసిందని షెర్లిన్ చోప్రా తెలిపింది. మీటూ వివాదంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు సాజిద్ ఖాన్‌కు వ్యతిరేకంగా గతేడాది షెర్లిన్ చోప్రా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షెర్లిన్ లక్ష్యంగా రాఖీ సావంత్ విమర్శలు గుప్పించింది. దీంతో గతేడాది అక్టోబర్ 29న సాజిద్ ఖాన్‌కు వ్యతిరేకంగా షెర్లిన్ చోప్రా వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
సాజిద్ ఖాన్‌ను సల్మాన్ ఖాన్ కాపాడుతున్నాడంటూ షెర్లిన్ చోప్రా ఆరోపించింది. సాజిద్ ఖాన్‌ను వెనుకేసుకొస్తూ.. షెర్లిన్‌పై విమర్శలు చేసింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ముంబయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రాఖీపై అంబోలి, ఓషివార పోలీస్టేషన్లలో షెర్లిన్ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు రాఖీని తాజాగా అరెస్టు చేశారు. తన వీడియో లింకులు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రసారం చేసిందనే ఆరోపణలపై షెర్లిన్ ఫిర్యాదు మేరకు రాఖీ సావంత్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
BREAKING NEWS!!!
AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022
YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

