పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ రాజ్యలక్ష్మి
- సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ అభినందన
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బైల్ కమ్మర సామాజిక వర్గానికి చెందిన రాజ్యలక్ష్మి దక్షిణ భారతదేశంలోనే పీహెచ్డీ పొందిన తొలి సంచార జాతి మహిళగా నిలిచిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రశంసించారు. మంగళవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో తనను కలిసిన రాజ్యలక్ష్మిని మంగళవారం ఆయన అభినందించారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో ఆమె పీహెచ్డీ పూర్తి చేయడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బైల్కమ్మరులను బీసీ జాబితాలో చేర్చడంతో ఉద్యోగావకాశం పొందే అర్హత సైతం రాజ్యలక్ష్మి సాధించిందని గౌరీశంకర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్టానికి ముందు ఎవరూ బైల్కమ్మరలను గర్తించలేదన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో వారిని బీసీ జాబితాలో చేర్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బైల్‌కమ్మరుల సంఘం ప్రధాన కార్యదర్శి కే మోహన్ చౌహాన్, తుల్జారాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- nomadic woman
- PHD
- Rajyalakshmi
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

