‘రాధేశ్యామ్’కు రాజమౌళి వాయిస్ ఓవర్
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఆదివారం ఓ సర్ప్రైజ్ అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు అగ్ర దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించబోతున్నారు. కథా గమనాన్ని, కీలకమైన ఘట్టాల్ని వివరిస్తూ సాగే ఆయన నేపథ్యగళం సినిమాకు ప్రధానాకర్షణ అవుతుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక కన్నడ వెర్షన్‌కు శివరాజ్‌కుమార్, మలయాళ వెర్షన్‌కు పృథ్వీరాజ్ సుకుమారన్ నేపథ్య గళాన్ని అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌పరమహంస, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సమర్పణ: గోపీకృష్ణమూవీస్, నిర్మాణం: యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు: కె.కె.రాధాకృష్ణకుమార్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

