రైల్వేలను ప్రైవేటీకరించడం జరుగదు : మంత్రి పియూష్ గోయల్

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడం జరుగదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని మంగళవారం చెప్పారు. ‘రైల్వేలను ప్రైవేటీకరించినట్లు మాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వ వాహనాలు మాత్రమే రోడ్లపై నడపాలని ప్రజలు ఎప్పుడూ అనరు. ఎందుకంటే ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు రెండూ ఆర్థికంగా సహాయపడతాయి. రైల్వేలో పెడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు ఇక్కడ సేవలను మరింత మెరుగు పరుస్తాయనే ఉద్దేశంతోనే మనం స్వాగతించాలి” అని గోయల్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశ రైల్వే మౌలిక సదుపాయాలు కొత్త విజన్‌ను చూశాయని, రైల్వే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలకు సమృద్ధిని తీసుకొచ్చినట్లు లోక్‌సభలో
రైల్వే గ్రాంట్స్ డిమాండ్లపై చర్చకు సమాధానమిస్తూ పియూష్ గోయల్ చెప్పారు.
‘భారత రైల్వేలు దేశానికి ‘వృద్ధికి ఇంజిన్’గా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రైల్వేల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించాం’ అని పియూష్ గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఎలాంటి ప్రాజెక్టులను అమలు చేయకుండా కంటితుడుపు ప్రకటనలు చేశారని గత ప్రభుత్వంపై ఆయన నిందలు మోపారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేసినప్పుడే దేశం మరింత వృద్ధి వైపు పయనించగలదని, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించగలదని మంత్రి అన్నారు. రెండేండ్లలో రైలు ప్రమాదం కారణంగా ఏ ఒక్క ప్రయాణికుడు చనిపోలేదని, ప్రయాణికుల భద్రతపై రైల్వే అధికంగా దృష్టి సారిస్తున్నదని చప్పారు. రైలు ప్రమాదం కారణంగా చివరి మరణం 2019 మార్చిలో జరిగింది అని మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

