Rafeal Nadal | ఖతార్ ఓపెన్ నుంచి వైదొలిగిన నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతాడా?
Rafeal Nadal : కెరీర్ చరమాంకంలో ఉన్న టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్(Rafeal Nadal) మరింత ఆలస్యంగా కోర్టులో అడుగుపెట్టనున్నాడు. కండరాల గాయం తిరగబెట్టడంతో స్వదేశంలో చికిత్స తీసుకుంటున్న నాదల్ తాజాగా ఖతార్ ఓపెన్...
Rafeal Nadal : కెరీర్ చరమాంకంలో ఉన్న టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్(Rafeal Nadal) మరింత ఆలస్యంగా కోర్టులో అడుగుపెట్టనున్నాడు. కండరాల గాయం తిరగబెట్టడంతో స్వదేశంలో చికిత్స తీసుకుంటున్న నాదల్ తాజాగా ఖతార్ ఓపెన్(Qatar Open 2024) నుంచి వైదొలిగాడు. పూర్తిగా కోలుకోకపోడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రఫా చెప్పాడు.
ఈ స్పెయిన్ బుల్ ఈ ఏడాది జరిగే ప్యారిస్ ఒలింపిక్స్, ఫ్రెంచ్ ఓపెన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మార్చిలో కార్లోస్ అల్కరాజ్తో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో నాదల్ కోర్టులో అడుగుపెడతాడని సమాచారం. అంతేకాదు ఇండియన్ వెల్స్, క్యాలిఫోర్నియాలో జరిగే మాస్టర్స్ 1000 టోర్నమెంట్లోనూ రఫా ఆడే అవకాశం ఉంది.
రఫెల్ నాదల్

‘లాస్ వేగాస్‌లో జరుగబోయే ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసంప్రాక్టీస్ చేస్తున్నా. అనంతరం ఇండియన్ వెల్స్ టోర్నీలోనూ పాల్గొంటాను. అయితే.. నా దృష్టంతా రొలాండ్ గరోస్ మీదే ఉంది. అంతేకాదు ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ ఆడాలని అనుకుంటున్నా. అలాగని ఇప్పుడే కన్ఫమ్ చేయలేను. కానీ, ఈ రెండు మెగా టోర్నీల్లో ఆడుతాననే నమ్మకం నాకుంది’ అని నాదల్ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు. దోహా వేదికగా ఖతార్ ఓపెన్ ఫిబ్రవరి 19 నుంచి జరుగనుంది.
టెన్నిస్ దిగ్గజాల్లో ఒకడైన నాదల్కు గాయాలు కొత్త కాదు. కెరీర్లో చాలాసార్లు అతడు మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోర్టులో అడుగుపెట్టి ట్రోఫీలు కొల్లగొట్టాడు. మట్టికోట(Clay Court) మహరాజుగా పేరొందిన నాదల్.. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైనా రికార్డు స్థాయిలో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాడు.

అయితే… 2023లో మొదలైన తొడ కండరాల నొప్పి మాత్రం రఫా కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసింది. దాంతో, జకోవిచ్‌కు పోటీనిచ్చే ప్రత్యర్థి కరువయ్యాడు. నిరుడు జకో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలిచి.. 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
- Aamir Khan | ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్ స్టార్ట్ చేసిన అమీర్ ఖాన్.. టైటిల్ ఎంటో తెలుసా.?
- MLC Kavitha | వేరుశనగ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

