“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర సాధనలో నవంబర్ 29 దీక్షా దివస్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉందని, దీనికి బీజం పడింది ఖమ్మం గడ్డ నుంచేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో నవంబర్ 29 దీక్షా దివస్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉందని, దీనికి బీజం పడింది ఖమ్మం గడ్డ నుంచేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ గారిని ఖమ్మం తీసుకువచ్చి, అరెస్టు చేసి, సబ్‌జైలుకు తరలించిన ఘటన తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచింది. నవంబర్ 29, డిసెంబర్ 9 ప్రకటనలు లేకుంటే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు అర్పించారని, అప్పటి కాంగ్రెస్ పాలకులు ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రలు చేశారని అజయ్ కుమార్ విమర్శించారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట వెళ్లి ఉద్యమకారులపై మొసలి కన్నీరు కార్చడం కాదని, ఇచ్చిన హామీలు, గ్యారంటీల ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ. 10 లక్షలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఉద్యమకారులను గుర్తించేందుకు మూడేళ్ల తర్వాత కమిటీ వేశారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి “కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను తులనాడితే సహించేది లేదని, తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పదేళ్లలో డ్యామ్‌లు, కాలువలు, చెరువులు నీటితో కళకళలాడాయని, దీనివల్ల సమృద్ధిగా పంటలు పండాయని తెలిపారు.ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షితమైన తాగునీరు అందించి నీటి కొరత లేకుండా చేశారని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేశారని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో 4 నుండి 7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుంటే, తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ త్రీ-ఫేజ్ కరెంట్ అందించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఇంచార్జ్ ఆర్జెసీ కృష్ణ, గిరిబాబు, మంజుల, మనీషా, కృష్ణార్జున రావు, విశ్వేశ్వర్ రావు, పోట్ల శ్రీనివాస్, బాణాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

