బీజేపీ నేత తజిందర్ అరెస్టు.. పంజాబ్ తీసుకెళ్తుంటే అడ్డుకున్న హర్యానా
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఇవాళ పంజాబ్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మొహాలీలోని సైబర్ సెల్లో నమోదు అయిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని ఢిల్లీలో పట్టుకున్నారు. బీజేవైఎం జాతీయ కార్యదర్శి అయిన తజిందర్‌పై ఆప్ నేత సన్నీ సింగ్ ఫిర్యాదు చేశారు. తజిందర్ విద్వేష ప్రకటనలు చేస్తున్నాడని, అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని, మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్చి 30వ తేదీన జరిగిన నిరసన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను తజిందర్ బెదిరించినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు సంబంధించిన వీడియోలను పోలీసులకు సమర్పించారు. తజిందర్ అరెస్టును బీజేపీ ఖండించింది. పంజాబ్‌లో రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చర్యలు తీసుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ పేర్కొన్నది. 50 మంది పంజాబీ పోలీసులు వచ్చి తజిందర్‌ను ఇంటి నుంచి తీసుకువెళ్లినట్లు బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు.
తజిందర్‌ను పంజాబ్‌కు తీసుకువెళ్తుండగా.. హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. బగ్గా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. గతంలో అయిదు సార్లు నోటీసు ఇచ్చినా.. బగ్గా విచారణకు హాజరుకాలేదని పంజాబీ పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

