అనూష శర్మ, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నో రామా రావన్స్ ఓన్లీ’. తిరుపతి, అనిత, కార్తీక్ దేవల్రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీరబ్రహ్మం స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ‘డిటెక్టివ్ ఎఫ్’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ర్యాప్ వెర్షన్లో రూపకల్పన చేసిన ఈ పాట శ్రోతలకు నచ్చుతుందని చిత్రబృందం తెలిపారు.