Syria | సిరియాలో మారణకాండ.. ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న ప్రభుత్వ దళాలు
సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవీచ్యుతుడైన తరువాత దేశంలో భారీ ఎత్తున హింస చెలరేగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న దళాలు అసద్ మద్దతుదారులపై పలు ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నాయి.
- ఐదు రోజుల హింసలో వెయ్యిమందికిపైగా మృతి
- వీధుల వెంబడి శవాలు
Syria | న్యూఢిల్లీ, మార్చి 10: సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవీచ్యుతుడైన తరువాత దేశంలో భారీ ఎత్తున హింస చెలరేగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న దళాలు అసద్ మద్దతుదారులపై పలు ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా అలావైట్లు నివసించే ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. అసద్‌కు మద్దతుదారులైన అలావైట్లు దేశంలో తిరుగుబాటును లేవదీసే అవకాశమున్నందున వారిని అణచివేస్తున్నామని సిరియన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎవరీ అలావైట్లు?
సిరియాలో అలావైట్లు మైనారిటీలు. మొత్తం జనాభాలో 12 శాతం ఉంటారు. లటాకియా, టార్టస్‌లలో వీరు ఎక్కువగా ఉంటారు. సిరియాను దాదాపు ఐదు దశాబ్దాల పాటు పాలించిన అసద్ అలావైట్ల వర్గానికి చెందినవారే. అసద్ పాలనలో అలావైట్లు అటు సైన్యంలో ఇటు రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు. అసద్ దేశం విడిచి వెళ్లిపోవడంతో ప్రస్తుత పాలకులకు విధేయులైన కొందరు సున్నీ వర్గీయులు.. అలావైట్లపై ప్రతీకార దాడులకు దిగుతున్నారు. ఎక్కడికక్కడ వారిని ఊచకోత కోస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా అసద్‌కు వెన్నుదన్నుగా నిలిచిన అలావైట్లు.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అలావైట్లు నివసిస్తున్న ప్రాంతాలకు విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేశారు. సిరియాలో హింసను అమెరికా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. సిరియాలో హింస పట్ల దాని సరిహద్దు దేశాలైన టర్కీ, ఇరాక్, జోర్డాన్ ఆందోళన వ్యక్తంచేశాయి, ఈ హింస ప్రాంతీయ అస్థిరతకు దారితీయవచ్చని హెచ్చరించాయి.
బహిరంగంగా ఉరి
హింస మొదలైన నాటి నుంచి ఇప్పటికి వెయ్యిమందికి పైగా మరణించినట్టు సిరియన్ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. అలావైట్ల ఇండ్లను లూటీచేసిన సాయుధులు అనంతరం వాటిని దహనం చేశారు. ప్రభుత్వ దళాలు యువకులను, పురుషులను బహిరంగంగా ఉరి తీస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది. వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని స్థానికులు చె ప్పారు. అసద్ మద్దతుదారులకు మరోదారి లేదని, లొంగిపోవాల్సిందేనని సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మ ద్ అల్ షరా పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై జీహాద్ ప్రకటించిందని, ఒక్కో ఇంటిని జల్లెడ పడుతూ అలావైట్లను అంతమొందిస్తున్నారని లటాకియా ప్రాంతానికి చెందిన ఓ పౌరుడు చెప్పా రు. మరోవైపు ప్రభుత్వ దళాల ప్రతినిధి ఒక వీడియోలో ‘ఇంతకుముందు విముక్తి కోసం యుద్ధం చేశాం, ఇప్పుడు దేశ ప్రక్షాళన కోసం యుద్ధం చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

