ఒక్కచోటే ఆగిపోకూడదు!

కేవలం హాస్యనటుడిగానే స్థిరపడిపోవడం తన అభిమతం కాదని..ఎప్పటికప్పుడు ఇమేజ్ను బ్రేక్ చేసుకుంటూ భిన్న పాత్రల్లో మెప్పించాలనుకుంటున్నానని చెప్పారు ప్రియదర్శి. తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆరిస్టుగా తనదైన ముద్రతో దూసుకుపోతున్నారాయన. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘జాతిరత్నాలు’ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రియదర్శి పాత్రికేయులతో సంభాషించారు.
తొలుత రాహుల్ రామకృష్ణ నాకు ఈ కథ చెప్పాడు. వింటూనే పడిపడి నవ్వాను. ‘ఇలాంటి కథలు నా దగ్గరకు ఎందుకు రావు’ అనిపించింది. ఆ తర్వాత నేను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. దర్శకుడు అనుదీప్ కథ చెబుతుంటే ఆసాంతం ఎంజాయ్ చేశా. ఈ సినిమాలో ఉండే జోక్స్, పంచ్ సంభాషణలు సాధారణంగా స్నేహితుల మధ్యలో వచ్చేవే. ఇలాంటి సిల్లీ కామెడీ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని తొలుత కొంచెం భయమేసింది. షూటింగ్‌కు ముందు నేను, నవీన్, రాహుల్‌రామకృష్ణ కలిసి వర్క్‌షాప్ చేశాం. సినిమా పూర్తయ్యాక సన్నివేశాల్ని చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం. మేము అనుకున్న విధంగానే ప్రేక్షకులు చిత్రానికి అద్భుత ఆదరణ కనబరుస్తున్నారు.
దర్శకుడి విజన్‌కు అనుగుణంగా..
‘జాతిరత్నాలు’ సినిమా ద్వారా నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా. కథ, దర్శకుడిని నమ్మి సినిమాలు చేయడమే విధిగా భావిస్తా. విలన్‌గా ప్రయాణాన్ని ప్రారంభించిన నేను ఈ స్థాయికి రావడానికి నాకోసం మంచి పాత్రలు సృష్టించిన దర్శకులు, రచయితలే కారణమనుకుంటున్నా.
వినోదంలో కొత్తదనం ఉండాలి
కామెడీ పండించడం అంత సులభం కాదు. ప్రతిసారి వ్యంగ్యం, వెటకారం కలబోసిన వినోదంతోనే రాణించలేం. వినోదంలో కూడా కొత్తదనం ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే విభిన్న కథాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నా. ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్‌గార్ల ప్రభావం నాపై చాలా ఉంది.
నిత్యం ప్రవహించాలి
స్వతహాగా నాకు రాజకీయ నేపథ్య చిత్రాలంటే ఇష్టం. అలాంటి కథల్లో నటించాలని ఉంది. నటుడిగా ఒక్కచోటే ఆగిపోకుండా నిత్యం ప్రవహిస్తూ సాగిపోవాలన్నదే నా తత్వం. ప్రస్తుతం ‘ఆహా’లో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నా. ‘మెయిల్’కు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. దర్శకత్వం గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచన లేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

