PrabhasHanu | ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘ఫౌజీ’ అప్డేట్ లేనట్లే.!
PrabhasHanu | ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే కావడంతో వరుస అప్డేట్లు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు నటిస్తున్న రాజా సాబ్తో పాటు సలార్ 2 సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి.
PrabhasHanu | ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే కావడంతో వరుస అప్డేట్లు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు నటిస్తున్న రాజా సాబ్తో పాటు సలార్ 2 సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. రాజాసాబ్ నుంచి ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయగా.. మరోవైపు సలార్ 2 మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు హోంబాలే బ్యానర్ ప్రకటించింది. అయితే ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ప్రభాస్ హను ప్రాజెక్ట్. పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం శరవేగంగా జరుపుకుంటుంది.
అయితే నేడు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని చూసిన ప్రభాస్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమా అప్డేట్ ఇప్పుడు ఇవ్వలేమని చిత్రబృందం అభిమానులకు షాక్ ఇచ్చింది.
డియర్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.. డార్లింగ్‌ను రాజా సాబ్‌లోని న్యూ లుక్‌లో మీరు చూశారు. ఈ స్పెషల్ డే నాడు ఇది ఎంజాయ్ చేయండి. ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన అప్డేట్ను మరో ప్రత్యేక రోజున విడుదల చేస్తాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
Dear Rebel Star Fans you have all witnessed the new avatar of our Darling #Prabhas with #RajaSaab Look 💥
Let’s celebrate #RajaSaab on this special day!#PrabhasHanu update will be given on another special occasion.
Happy Birthday, Rebel Star #Prabhas Garu ✨ pic.twitter.com/mRp0OloMTU
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2024
ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్గా ఇమాన్ ఎస్మాయిల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

