రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ.. గన్‌తో బెదిరించి పారిపోయిన ఎస్ఐ

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అయితే ఆ వెంటనే తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో వాళ్లను బెదిరించి డబ్బుతో అక్కడి నుంచి పరారయ్యాడు. గణేష్ కండేకర్ అనే ఆ ఎస్ఐపై తమకు ఫిర్యాదు అందినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. మన్‌గావ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉన్న గణేష్.. ఓ కేసు రిజిస్టర్ చేయడానికి రూ.50 వేలు లంచం అడిగినట్లు ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పాడు. దీంతో ఎస్ఐని పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు వలపన్నారు.
సరిగ్గా లంచం తీసుకునే సమయంలో అతన్ని పట్టుకున్నారు. ఏసీబీకి చెందిన సీఐ, కానిస్టేబుల్ గణేష్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అతడు తన రివాల్వర్ తీయడం గమనించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌పైకి తన బైకుతో దూసుకెళ్లిన ఎస్ఐ.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. పరారీలో ఉన్న ఆ ఎస్ఐపై కేసు నమోదైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

