ఫిరోజ్‌ఖాన్, సనాఖాన్, సంహిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యు ఆర్ మై హీరో’. షేర్ దర్శకుడు. మిన్ని నిర్మాత. ప్రస్తుతం వైజాగ్ సమీపంలోని నర్సీపట్నంలో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ ‘హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మాఫియా డాన్‌పై ఓ పోలీస్ అధికారి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అతడు ఆత్మగా మారడానికి కారణాలేమిటన్నది ఈ చిత్ర ఇతివృత్తం. చక్కటి సందేశంతో తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘మూడు పాటలు, ఫైట్స్ ఉంటా యి. హైదరాబాద్‌తో పాటు గోవాలో షూటింగ్ జరిపాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కావేటి.