లక్నో : యువతను మత్తుతో చిత్తు చేస్తున్న డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నడిపిస్తున్న హుక్కా బార్‌పై పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. యూపీలోని కాన్పూర్ కలాసీ లైన్ ప్రాంతంలో ఆఫ్‌లైన్ కేఫ్‌తో పాటు కొహ్నాలో ఫ్రెండ్స్ కేఫ్‌పై పోలీసులు దాడులు చేపట్టారు.
రెండు కేఫ్‌లు కాన్పూర్‌లోని ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయి. కేఫ్‌ల్లో హుక్కాను అనుమతించినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని కేసులు నమోదు చేశామని ఏసీపీ త్రిపురారి పాండే వెల్లడించారు. నిందితులపై చలాన్లు కూడా జారీచేశామని చెప్పారు.
హుక్కా బార్లపై దాడులు కొనసాగుతాయని హుక్కా పార్లర్ల మూసివేత దిశగా చర్యలు చేపడతామని ఏసీపీ వెల్లడించారు. పలు హుక్కా బార్లపై దాడులు చేపట్టేందుకు జాబితా రూపొందించామని తెలిపారు.