నడువాలె మన దేశపు పాలన.. దార్శనికుడు కేసీఆర్ తోవన
అభివృద్ధి సంక్షేమమే జనపాలన లక్ష్యంగా సబ్బండ జాతుల్లో సింగిడి రంగులు విరియగ....
పల్లవి:
దుక్కి దున్ని సాలు తీసి
మొక్కలేసి పొతం జేసి
పంటను పసిబిడ్డ వోలె
కాపు రైతు సాది నట్టు….
సాగుతోంది కేసీఆర్ పాలన
దేశమే తెలంగాణ బాటన..
చరణం:
నూలు పోగు సవరించి
మగ్గాన్ని ఆడించి
శాలోల్ల భావన రుషి
కొత్త చీర నేసినట్టు..
॥ సాగుతోంది॥
మంద నుంచి గొర్రె పిల్ల
కాటు కలువకుంట కాసి
ఎలమందా తన మందను
మల్లేసుకున్నట్టు..
తంగేడు చెక్క తెచ్చి
లందల తోలును తాల్చి
మాదిగోల్ల చెన్నన్నా
కాలి చెప్పు మలిసినట్టు..
సకినాల పిండోలే
సుక్కమన్ను పుటం బెట్టి
కుమ్మరి లింగన్న
కుండను సృజియించినట్టు…
॥ సాగుతోంది॥
మోకును తాడుకు సుట్టీ
స్వర్గానికి ఎగబాకీ
సుర గంగను గౌడన్న
భువికి దించి పంచినట్టు..
॥ సాగుతోంది॥
వడుపుతోటి వల విసిరి
ముదిరాజు ముత్తన్న
నిండు సంద మామలను
వొడ్డుకొడిసి పట్టినట్టు..
కొలిమిల ఇనుమును కాల్చి.
సమ్మెటతో సాగదీసి
కమ్మరోల్ల ఎంకన్న
కర్రు పదును పెంచినట్టు..
వులిబాడ్సేను ఆడిస్తూ
వొడ్ల బ్రమ్మచారి మామ
యాప కొమ్మను చెక్కి
ఇలవేల్పుగ కొలిచి నట్టు..
॥ సాగుతోంది॥
తీరొక్క పుల్ల దెచ్చి
గూడు అల్లుకున్న పిట్ట
తన పిల్లల రెక్కలల్ల
పొదిగి సాదుకున్నట్టు..
ఇటుక మీద ఇటుక పేర్చి
ఇగురంతో ఇల్లు కట్టి
సుతారంగ తాపి మేస్త్రి
మనకు గూడు నిలిపినట్టు..
మైల బట్టలన్నీ ఏరి
చెరువు తల్లి గుడికి చేర్చి
సాకలోల్ల రామక్క
మల్లెమాల అల్లినట్టు..
॥ సాగుతోంది॥
పాపుల క్షమియించుతూ
క్రీస్తు సిలువ మొసినట్టు
అల్లా దయ కోరుతూ
నమాజును చేసినట్టు..
గోధూళి వేళల్లో
ఆధ్యాత్మిక రాగాల
సూఫీ సంచారి యోగి
స్థిత ప్రజ్ఞత చూపినట్టు..
లోకహితం కోరుకుంటూ
భగవంతుని వేడుకుంటూ
నిష్ఠతోని మహారుషి
కఠిన దీక్ష చేసినట్టు…
॥ సాగుతోంది॥
తల్లి వోలె తల నిమిరి
తలనీలాలను కొరిగి
మనిషికి మంగళి కత్తి
మానవతను నేర్పినట్టు..
పనిముట్లు నాట్యమాడ
సృజనతో తాళం వేస్తూ
కృష్ణ శిలను మహశిల్పి
దైవముగా మలిచినట్టు..
పసిగుడ్డుకు పురుడు బోసి
జన్మకు వారధి కట్టీ
పదిలంగా మంత్రసాని
తల్లి ఒడిల చేర్చినట్లు..
॥ సాగుతోంది॥
ఫెడరల్ స్ఫూర్తే
దేశ సమైక్యతకు రక్షయని..
గంగా జమునీ సంస్కృతి
భారతీయ తత్వమని..
అభివృద్ధి సంక్షేమమే
జనపాలన లక్ష్యంగా
సబ్బండ జాతుల్లో
సింగిడి రంగులు విరియగ….
నడువాలే మన దేశపు పాలన
బంగారి తెలంగాణ బాటన
నడువాలె మన దేశపు పాలన
దార్శనికుడు కేసీఆర్ తోవన
– రమేశ్ హజారి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

