టెక్స్టైల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్
పీయూష్ గోయల్ | కేంద్ర టెక్స్టైల్ మంత్రిగా పీయూష్ గోయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన స్మృతి ఇరానీ ఆయనకు బాధ్యతలు అప్పగించి,

న్యూఢిల్లీ : కేంద్ర టెక్స్టైల్ మంత్రిగా పీయూష్ గోయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన స్మృతి ఇరానీ ఆయనకు బాధ్యతలు అప్పగించి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త మంత్రిత్వ శాఖ కేటాయించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ తన పదవీకాలంలో మంత్రిత్వశాఖ చాలా మంచి పనులు చేశారంటూ ప్రశంసించారు. టెక్స్టైల్ రంగం బలంగా ఉండాలని, ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారని గోయల్ పేర్కొన్నారు.
టెక్స్టైల్స్ పెద్ద ఉపాధి రంగమని, దీని ద్వారా ఈ రంగంలో పనిచేసే వారందరికీ, ముఖ్యంగా మహిళల ఆదాయం కోసం మరింత సహకారం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. టెక్స్టైల్ రంగాన్ని మరింత మెరుగుపరిచి, ఎగుమతులు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఇంతకు ముందు బ్రాండ్ ఇండియాను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన భారతీయ వస్త్రాలు మళ్లీ కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్స్టైల్ మంత్రిత్వశాఖ సహాయ మంత్రిగా దర్శన్ విక్రమ్ జర్దోష్ బాధ్యతలు స్వీకరించారు. పీయూష్ గోయల్ మార్గదర్శనంలో వస్త్రరంగం అభివృద్ధికి పాటుపడుతానన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

