చిన్నారులపై ‘ఫైజర్’ క్లినికల్ ట్రయల్స్

వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతోంది. చిన్నాపెద్ద అంతా వైరస్ బారినపడుతున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇందులో చిన్నారులకు టీకాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో అమెరికా ఫార్మా దిగ్గజం కీలక ప్రకటన చేసింది. ఫైజర్ ఇంక్, జర్మనీకి చెందిన బయో ఎంటెక్‌తో కలిసి 12 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లల్లో కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టీకాలు అందుబాటులో తేవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ట్రయల్స్‌లో భాగంగా బుధవారం వలంటీర్లకు మొదటి డోస్ ఇచ్చినట్లు ఫైజర్ ప్రతినిధి షరోన్ కాస్టిల్లో తెలిపారు. ఫైజర్, బయో ఎంటెక్ వ్యాక్సిన్‌కు యూఎస్ రెగ్యులేటరి అధికారులు డిసెంబర్ చివరలో 16 అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిపై ప్రయోగాలకు అధికారం ఇచ్చారు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సమాచారం ప్రకారం.. బుధవారం నాటికి అమెరికాలో దాదాపు 66 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ ఇవ్వబడింది. ఈ పిడియాట్రిక్ ట్రయల్ ఆరు నెలల వయస్సులోపు పిల్లలపై చేయనున్నారు. గతవారం మోడెర్నా ఇంక్ సైతం ఇదే తరహాలో ట్రయల్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం అమెరికాలో 16-17 సంవత్సరాల పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేస్తున్నారు. మోడెర్నా టీకా 18 అంతకంటే ఎక్కువ వయస్సున వారికి మాత్రమే అనుమతి ఉండగా.. చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఫైజర్ రెండు షాట్ల వ్యాక్సిన్‌ను మూడు వేర్వేరు మోతాదుల్లో 10, 20, 30 మైక్రోగ్రాముల వద్ద 144 మంది చిన్నారులపై రెండు దశల ట్రయల్స్ యోచిస్తోంది. చివరి వరకు 4,500 మంది మందిపై ట్రయల్స్ విస్తరించాలని భావిస్తోంది. టీకా ద్వారా ఉత్పన్నమయ్యే భద్రత, సహనం, రోగ నిరోధక ప్రతి స్పందనను పరిశీలించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

