Afghanistan | ఆఫ్ఘన్లో దారుణ పరిస్థితులు.. వాటర్ బాటిల్ ధర రూ.3వేలు, ప్లేట్ రైస్ రూ.7500

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు చేరింది. ఇక ప్లేట్ రైస్‌కు వంద డాలర్లు (రూ.7500) ఖర్చు చేయాల్సిన దుస్థితి ఎదురైంది.

మరో వైపు స్థానిక ఆఫ్ఘన్ కరెన్సీని విమానాశ్రయంలో తీసుకోవడం లేదు. కేవలం డాలర్లు మాత్రమే అనుమతి ఇస్తుండడంతో ఆఫ్ఘన్ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ఆకలి దప్పికతో అలమటిస్తున్నారు. మరో వైపు పిల్లల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం విమానాశ్రయం వద్ద దాదాపు 50వేల మంది వరకు జనం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు విమానాశ్రయానికి చేరుతున్నారు. ఇందులో కొంత మందిని మాత్రమే లోనికి అనుమతి ఇస్తుండడంతో వేలాది మంది వెలుపల నిరీక్షిస్తున్నారు. అందరినీ లోనికి అనుమతించకపోవడంతో బయటే పడిగాపులు పడుతున్నారు. ఎలాగైనా తాలిబన్ల నుంచి బయటపడాలని కష్టాలకోర్చుకుంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
KTR | తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

