పెళ్లి సందD సినిమాకు జాక్ పాట్.. అదనంగా మరో 5 కోట్లు..
Pelli SandaD Movie in OTT | కొన్ని సినిమాలకు అలా లక్ కలిసొస్తుంది అంతే..! నెగెటివ్ టాక్‌తో ఓపెన్ అయిన తర్వాత సేఫ్ అవ్వడమే గొప్ప అనుకుంటే.. దానికి భారీ లాభాలు రావడం అనేది అద్భుతం. అలాంటి మిరాకిల్ పెళ్లి సందD సినిమా విషయంలో జరిగింది. కరోనా కారణంగా కొన్ని సినిమాలను థియేటర్స్ కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఒకవేళ థియేటర్స్ లో విడుదలైనా 30 రోజుల్లోపే ఒరిజినల్ ప్రింట్ విడుదల చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి సినిమాకు మంచి రేటు ఇచ్చి ఓటీటీ సంస్థలు ఆయా సినిమాలను సొంతం చేసుకుంటున్నాయి. వీలైనంత త్వరగా వాటిని ప్రీమియర్ చేస్తున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా కూడా 50 రోజుల తర్వాత కచ్చితంగా ఒరిజినల్ ప్రింట్ విడుదల కావాల్సిందే.
అల్లు అర్జున్ పుష్ప, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు విడుదలైన నాలుగు వారాల లోపే ఓటీటీలోకి వచ్చేశాయి. మరోవైపు ఆఖండ, ఉప్పెన అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా 50 రోజుల తర్వాత ఒరిజినల్ ప్రింట్ విడుదలయ్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అదే పెళ్లి సందD. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోణంకి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. నెగెటివ్ టాక్ వచ్చినా కూడా దసరా పండగ సీజన్‌ను బాగా క్యాష్ చేసుకోవడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు కూడా తీసుకొచ్చింది పెళ్లి సందD. ముఖ్యంగా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాకు పోటీగా విడుదలైన శర్వానంద్ మహా సముద్రం డిజాస్టర్ కావడం పెళ్లి సందD సినిమాకు బాగా కలిసి వచ్చింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే ఆడినా దాంతో పాటు రోషన్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది. అక్టోబర్ 15న విడుదల అయిన ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ ఇంకా రాలేదు. అయితే ఇన్ని రోజుల తర్వాత జీ 5 వాళ్లు ఏకంగా 7 కోట్లు ఇచ్చి ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. సినిమాకు అయిన బడ్జెట్‌కు ఇప్పటికే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి. ఇప్పుడు అదనంగా మరో 5 కోట్లకు పైగానే లాభాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ భారీ రేట్ కారణంగా లేట్ అయినా.. ధైర్యం చేసి జీ వాళ్లు తీసుకున్నారు. అదిరిపోయే పాటలు ఉండటం.. ఫ్యామిలీ సినిమా కావడంతో కచ్చితంగా పెళ్లి సందD టీవీతో పాటు ఓటీటీలోనూ మాయ చేయడం ఖాయం అని నమ్ముతున్నారు వాళ్లు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
Read More :
OTT | 100 రోజులు దాటినా పెళ్లి సందD ఇంకా ఓటీటీలో ఎందుకు రాలేదు..?”
“రోషన్ నెక్ట్స్ సినిమా కోసం భారీ ఏర్పాట్లు.. రంగంలోకి వైజయంతి మూవీస్..”
“భారీగా రెమ్యునరేషన్‌ను పెంచిన ‘పెళ్లి సందD’ హీరోయిన్..”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

