Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తును ఆన్లైన్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కార్యదర్శులు బలవంతపు వసూళ్లలో నిమగ్నమయ్యారు.
Indiramma Bima | వాజేడు, నవంబర్ 26: ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తును ఆన్లైన్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కార్యదర్శులు బలవంతపు వసూళ్లలో నిమగ్నమయ్యారు. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం ములుగు జిల్లా వాజేడు మండలంలోని 17 జీపీల్లో ఆన్లైన్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ బీమా దరఖాస్తు ఆన్లైన్ కోసం వచ్చే కుటుంబాలు తప్పనిసరిగా ఇంటి పన్ను చెల్లించాలని, లేదంటే నమోదు చేయమని అధికారులు చెబుతున్నారు.
దీంతో ఇంటి పన్ను కట్టిన వారు మాత్రమే వచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు లేక ఆయా కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ ఎంపీవో షాజహాన్‌ను సంప్రదించగా ఇంటి పన్ను వసూళ్లలో మండలం వెనుకంజలో ఉందని, అందువల్లే తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పైఅధికారుల ఆదేశాల మేరకే ఇంటి పన్ను వసూలు చేస్తున్నట్లు చంద్రుపట్ల జీపీ కార్యదర్శి బంధం రవీందర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
Gold Price | పసిడి పయనమెటు.. ఈ ఏడాది రూ.55,500 డౌన్.. ఇప్పుడు కొనాలా.. వేచి చూడాలా?
Delimitation Bill | డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం.. 30 నుంచి లోక్‌సభ, 2 నుంచి రాజ్యసభ సమావేశాలు
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
Vivek Venkataswamy | పెద్దపల్లి వివాదంతో నాకేం సంబంధం.. కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్‌తో వివేక్
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

