పవన్ మాటలు బాధ్యత పెంచాయి
‘అయ్యారే’,‘అప్పట్లో ఒకడుండేవాడు’చిత్రాలు దర్శకత్వ ప్రతిభను చూపించగా… తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఘన విజయం సాగర్‌కు కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో నాగవంశీ నిర్మించారు. ‘భీమ్లా నాయక్’ విజయంపై దర్శకుడు సాగర్ కె చంద్ర తన సంతోషాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘భీమ్లా నాయక్’ సక్సెస్ పార్టీలో డ్యాన్సులు చేశారు?
పవన్‌కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఓ సక్సెస్ పార్టీకి వచ్చారు. చిత్రబృందం అంతా అక్కడికి వెళ్లాం. థమన్ లైవ్ మ్యూజిక్ ఇచ్చాడు. అలా సంతోషంలో డ్యాన్సులు చేశాను. సినిమాకు పనిచేసిన వాళ్లంతా కలిసి వేడుక జరుపుకోవడం మర్చిపోలేని సందర్భం.
ఈ సినిమా మేకింగ్‌లో ఎదురైన సవాళ్లు ఏమిటి?
‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా విడుదలవగానే నిర్మాత నాగవంశీ ఫోన్ చేసి ఈ సినిమా రీమేక్ చేద్దాం మీరు చేస్తారా అని అడిగారు. అప్పటికి హీరోలు ఎవరన్నది నిర్ణయించలేదు. పవన్, రానా ప్రధాన పాత్రలకు అనుకున్నప్పుడు మార్పులు చేర్పులపై త్రివిక్రమ్‌తో కూర్చుని చర్చలు మొదలుపెట్టాం. మాతృకలో కోషి పాత్రలో స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించారు, అయ్యప్పన్ నాయర్ క్యారెక్టర్‌ను బిజు మీనన్ చేశారు. ఇక్కడ ఆ పాత్రలను తారుమారు చేయాలి. పవన్‌కళ్యాణ్ స్టార్ కాబట్టి ఆయన ఇమేజ్‌కు తగినట్లు మాస్ అంశాలు చేర్చుతూ మార్పులు చేశాం. భీమ్లా మేకింగ్‌లో మేము ఎదుర్కొన్న పెద్ద సవాలు ఇదే.
సినిమా ప్రారంభం ముందు పవన్‌కల్యాణ్ మీకు చెప్పిన సలహా ఏమిటి?
‘భీమ్లా నాయక్’ రూపొందించేందుకు నిర్ణయం జరిగాక పవన్‌కల్యాణ్‌ను కలిశాను. ఆయన అప్పుడు ‘వకీల్ సాబ్’ సెట్లో ఉన్నారు. బాధ్యతగా పనిచేయ్, బాగా తీయ్ అని చెప్పారు. పవన్ మాటలతో మరింత ఉత్సాహంగా పనిచేశాను.
మాతృకలోని కొన్ని సన్నివేశాలు ‘భీమ్లా నాయక్’లో లేకపోవడానికి కారణమేంటి?
మలయాళ మూవీ మేకింగ్‌లో సహజత్వం ఉంటుంది. కంటిన్యుటీ సన్నివేశాలు ఉంటాయి. మన నేటివిటీకి అలా తీస్తే నచ్చదు. ఉదాహరణకు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’లో బైక్ లిఫ్ట్ ఇచ్చే సీన్ భీమ్లా..లో లేదు. ఎందుకంటే అప్పటికే భీమ్లా ఫ్లాష్ బ్యాక్ డేనియల్ తెలుసుకుంటాడు. వీళ్లంతా ఇతన్ని దేవుడు అంటున్నారు అనే సందేహం మొదలవుతుంది. అలాంటప్పుడు భీమ్లా, డేనియల్ మధ్య ఏం మాట్లాడించగలం. అందుకే ఆ సన్నివేశం తీసేశాం. మనిషిలో మార్పు మొదలయ్యేప్పుడు మళ్లీ మొదటికి తీసుకెళ్లకూడదు.
తెలుగులో ఇలాంటి కథలతో స్టార్లను పెట్టి సినిమా చేయలేమా?
మన ప్రేక్షకులు సినిమా నుంచి కోరుకునేది వేరు. మన స్టార్ల సినిమాల్లో మాస్ అంశాలుండాలి. భారీతనం కనిపించాలి. గ్లామర్ చేర్చాలి. చూసేవాళ్ల అభిరుచి మేరకే ఇండస్ట్రీ సినిమాలను రూపొందిస్తుంటుంది.
మీ కొత్త సినిమా ఏ హీరోతో చేస్తున్నారు వరుణ్ తేజ్ హీరోగా 14 రీల్స్ సంస్థలో ఓ సినిమా చేసేందుకు గతంలో చర్చలు జరిగాయి. త్వరలో ఈ కథ లేకుంటే మరో కథతో సినిమా చేస్తాను.
త్రివిక్రమ్ వల్ల మీకు పేరు రాలేదని ఎప్పుడైనా అనిపించిందా?
త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా నాకంటే అనుభవజ్ఞుడు. పవన్ లాంటి స్టార్‌తో సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎంతబాగా వచ్చిందనేది మాకు ముఖ్యం. త్రివిక్రమ్ సలహాలు సూచనలు తీసుకోవడంలో తప్పులేదు. ఆయన సహకారం లేకుంటే ‘భీమ్లా నాయక్’ ఇంత ఘన విజయం సాధించేది కాదు. ఘనత అనే దానికి అంతం ఉండదు. నాకొచ్చిన గుర్తింపునకు సంతృప్తిగా ఉన్నాను.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

