కారా మాస్టారు మృతి కి పవన్ కళ్యాణ్ సంతాపం

అమరావతి ,జూన్ 4: ప్రముఖ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన తుది శ్వాస విడిచారనే విషయం తీవ్ర విచారానికి లోను చేసిందని పవన్ అన్నారు. ‘కారా మాస్టారుగా తెలుగు భాషాప్రియులు, సాహిత్యాభిమానులు, రచయితలకు అభిమానపాత్రులు. కారా మాస్టారు పేరు చెప్పగానే ఆయన రాసిన ‘యజ్ఞం’ గుర్తుకు వస్తుంది. సమాజంలో అట్టడుగు వర్గాలవారి బతుకు చిత్రాన్ని, జీవన సమరాన్ని అక్షరాల్లో చూపించారు. పెత్తందారీ వ్యవస్థలో అణగారిన వర్గాలు, పేదలు దోపిడీకి గురవుతున్న వైనాన్ని ఆలోచన రేకెత్తించేలా చెప్పారు. తెలుగు కథా సాహిత్యం పట్ల వారు చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేం’ అని పవన్ పేర్కొన్నారు.
‘ప్రచురితమైన ప్రతి తెలుగు కథను భద్రపరచి, భావితరాలకు అందించేందుకు శ్రీకాకుళంలో కథా నిలయం నెలకొల్పి కారా మాస్టారు సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం. కారా మాస్టారు మృతి తెలుగు సాహిత్యానికి… ముఖ్యంగా కథా సాహిత్యానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

