Tiruchanur | పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
-held-at-

తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ నిర్వహించారు.

అమ్మవారికి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. కాగా, సాయంత్ర 6.00 నుంచి 7.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో జేఈఓ సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, ఏఈఓ ప్రభాకర్‌రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

