హోంమంత్రిపై సీబీఐ విచారణ.. సుప్రీంకోర్టుకు పరమ్‌బీర్ సింగ్

న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని పోలీసు అధికారి సచిన్ వాజేను ఆదేశించారంటూ సంచలన ఆరోపణలు చేసిన ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరమ్‌బీర్ సింగ్.. తాజాగా సుప్రీంకోర్టుకూ వెళ్లారు. ఈ ఆరోపణలపై ఆయన సీబీఐ విచారణ కోరారు. తనను హోంగార్డ్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరమ్‌బీర్.. అందులోనే తన ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలనీ కోరడం గమనార్హం. ముకేశ్ అంబానీ ఇంటి బయట పేలుడు పదార్థాల కేసు విచారణ మధ్యలో ఉన్న సమయంలో ముంబై పోలీస్ కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ను బదిలీ చేశారు. ఆ వెంటనే ఆయన హోంమంత్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. అయితే ఈ ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. అటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా హోంమంత్రిని వెనకేసుకొచ్చారు. అంబానీ కేసు విచారణను పక్కదారి పట్టించేందుకే హోంమంత్రిపై ఈ ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

